🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃🚩🍃
కామారెడ్డి మే 17 ప్రాంతీయ వార్త ప్రతినిధి.
*_తెలంగాణ పల్లెల్లో కల్తీ కల్లు తాగి పేద ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇది ఈరోజు కొత్తగా పుట్టిన సమస్య కాదు. 30 ఏళ్లుగా ప్రతి ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేసింది. ఎక్సైజ్ శాఖ ఉంది తప్ప, ఎక్సైజ్ పని లేదు._*
*_ఒకప్పటి కల్లు vs ఇప్పటి కల్లు:_*
*_మా తాతల కాలంలో తాటి చెట్టు, ఈత చెట్టు నుండి సహజంగా కారిన కల్లు తాగేవాళ్లు. అది ఆరోగ్యానికి మంచిది, బలానికి మందు. కానీ ఇవాళ చెట్టు ఎక్కే గీత కార్మికుడే లేడు. ఊరికో రెండు చెట్లు గీస్తే, వంద మందికి కల్లు ఎక్కడి నుండి వస్తుంది?_*
*_సమాధానం: కృత్రిమ కల్లు. ఆల్ఫ్రజోలం మాత్రలు, డయాజిపామ్, క్లోరల్ హైడ్రేట్ లాంటి నిద్ర మాత్రలు కలిపి, బెల్లం నీళ్లు పులియబెట్టి “కల్లు” అని అమ్ముతున్నారు. ఇది తాగితే కిడ్నీలు దెబ్బతింటాయి, లివర్ పాడవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. డ్రగ్స్‌కు బానిసలు అయినట్టు ఈ కల్తీ కల్లుకు బానిసలు అవుతున్నారు._*
*_ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉంది?_*
*1. _ఎక్సైజ్ ఆదాయం_: కల్లు దుకాణాల లైసెన్సులు, లిక్కర్ ఆదాయం ప్రభుత్వానికి ఏడాదికి ₹30,000 కోట్లు. ఆదాయం పోతుందని భయపడి కల్తీని అడ్డుకోవడం లేదు.*
*2. _రాజకీయ అండదండలు_: ప్రతి గ్రామంలో కల్తీ కల్లు డిపోలు నడిపేది స్థానిక నాయకులే. అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా అందరి వాటాలు అందుతాయి.*
*3. _గీత కార్మికుల నిర్లక్ష్యం_: సహజ కల్లు గీసే వారికి ప్రోత్సాహం లేదు. చెట్లు పెంచే పథకం లేదు. కృత్రిమ కల్లు మీద ఆధారపడేలా చేశారు.*
*_రేవంత్ రెడ్డి సర్కార్‌పై ప్రశ్న:_*
*_కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు దాటింది. “మార్పు మొదలైంది” అని చెప్పుకున్నారు. మరి పల్లెల్లో కల్తీ కల్లు చావులు ఎందుకు ఆగలేదు?_*
1. ఎక్సైజ్ శాఖ దాడులు పేపర్ మీద తప్ప క్షేత్రస్థాయిలో లేవు._*
2. ల్యాబ్ టెస్టులు చేసి కల్తీ అని తేలిన దుకాణాలు మూసివేత లేదు.*
*_3. గీత కార్మికులకు సబ్సిడీ, చెట్ల పెంపకం, సహజ కల్లు ప్రోత్సాహక పథకం ఎక్కడ?_*
*_ప్రభుత్వం మారినా, ప్రజల చావులు మారలేదు. అంటే వ్యవస్థ మారలేదు._*
*_మా డిమాండ్లు:_*
వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాల్లో ల్యాబ్ టెస్టులు_: కల్తీ తేలితే లైసెన్స్ రద్దు, యజమానిపై క్రిమినల్ కేసు.*
సహజ కల్లుకు ప్రోత్సాహం_: తాటి, ఈత చెట్లు పెంచిన గీత కార్మికుడికి ఎకరానికి ₹10,000 సబ్సిడీ. నియో-టాడీ బోర్డు ఏర్పాటు.*
ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన_: కల్తీ కల్లుకు సహకరించే అధికారులపై డిస్మిస్ వేటు.*
బాధిత కుటుంబాలకు నష్టపరిహారం_: కల్తీ కల్లు తాగి చనిపోయిన వారి కుటుంబానికి ₹10 లక్షల ఎక్స్‌గ్రేషియా.
పేదవాడి ప్రాణం అంటే ప్రభుత్వానికి లెక్క లేదా? ఓట్లు వేసేది పల్లె ప్రజలే. వాళ్లను కాపాడుకోలేని ప్రభుత్వం ఎందుకు
కల్తీ కల్లు అమ్మకాలపై యుద్ధం ప్రకటించకపోతే, అఖిల భారత ఓసీ సంఘం & EWS ఆధ్వర్యంలో గ్రామగ్రామాన ఉద్యమం చేస్తాం. ప్రజల ఉసురు తప్పకుండా తగులుతుంది.
పెన్ బై రవీందర్
