ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిమార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం*

మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం*

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త మే 20

  చేగుంట మండల  వ్యవసాయ మార్కెట్ కమిటీ
కార్యాలయంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు అధ్యక్షతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ
సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఉష్ గత 3 నెలలకు సంబంధించిన ఆదాయ,
వ్యయాలకు సంబంధించిన వివరాలను పాలకవర్గం సభ్యులకు చదివి వినిపించారు.అనంతరం సభ్యులందరూ అభివృద్ధి పనులు, పలు అంశాలపై ఏకగ్రీవంగా
తీర్మానాలు చేసి సంతకాలు చేశారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడతూ కొనుగోలు కేంద్ర ల లో ఎలాంటి సమస్య ఉన్న చైర్మన్ కి గాని, డైరెక్టర్ లకు సంప్రదించాలని రైతులు ఎవరు అధైర్య పడకూడదని,  ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని, అన్నారు, సమావేశంలో డైరెక్టర్లు ఎత్తిన పలు సమస్యలపై వెంటనే సంబంధిత స్థానిక తాసిల్దార్,  ఎంపీడీవో తో మాట్లాడడం  జరిగింది, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కార్యాలయనికి  కొత్తగా 25 కాంటాలు వచ్చినాయని,అవుసరం ఉన్న వారు (వి ఏ ఓ లు )వచ్చి, పాతవి ఇచ్చి కొత్తవి తీసుకుగలరని అన్నారు ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, అన్నం ఆంజనేయులు, కాషాబోయిన శ్రీనివాస్, మొహమ్మద్ రఫీ, శ్రీధర్ రెడ్డి, పక్కిర్ నాయక్, కుర్మ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!