ePaper
Friday, July 17, 2026
ePaper
Homeఎడిటోరియల్శివాలయ పరిసరాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం.భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం.

శివాలయ పరిసరాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం.భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం.

📰 Generate e-Paper Clip


ప్రాంతీయ వార్త జూలై 05 (ఆదివారం):
సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో గల శివాలయ ఆవరణలో దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి ఆలయ పరిసరాలను పూర్తిగా పరిశుభ్రం చేశారు.
వర్షాకాలంలో పాములు, విషపురుగులు మరియు దోమలు వంటి వాటి సంచారం పెరిగే అవకాశం ఉండటంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు పరిశుభ్రమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఆలయ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆలయ పవిత్రతను కాపాడేందుకు గ్రామస్థులు, భక్తులు ఎల్లప్పుడూ సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిశుభ్రత కార్యక్రమాలను నిరంతరం నిర్వహించి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!