శివాలయ పరిసరాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం.భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యం.

ప్రాంతీయ వార్త జూలై 05 (ఆదివారం):సదాశివనగర్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో గల శివాలయ ఆవరణలో దేవాలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి ఆలయ పరిసరాలను పూర్తిగా పరిశుభ్రం చేశారు.వర్షాకాలంలో పాములు, విషపురుగులు మరియు దోమలు వంటి వాటి సంచారం పెరిగే అవకాశం ఉండటంతో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయానికి వచ్చే...