(రాజంపేట, జూలై 4 ప్రాంతీయ వార్త)
రాజంపేట గ్రామానికి చెందిన వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు, పరువుకు భంగం కలిగించే పోస్టులు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం పలువురు రాజకీయ నాయకులు రాజంపేట ఎస్‌ఐ మహేష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుబ్బని శ్రీకాంత్ మాట్లాడుతూ, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ అసత్య ప్రచారం, వ్యక్తిగత దూషణలు చేయడం సమాజంలో అశాంతికి దారితీసే చర్యలని అన్నారు. ప్రజాప్రతినిధుల పరువుకు భంగం కలిగించే తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన ఎస్‌ఐ మహేష్ స్పందిస్తూ, ఫిర్యాదుపై సమగ్ర విచారణ నిర్వహించి, నిబంధనల ప్రకారం బాధ్యులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు నల్లవెల్లి అశోక్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పటేల్ సాయిబాబా, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చింతల స్వామి, ఉప సర్పంచ్ ఇమ్రాన్ అలీ, సురేష్, బల్ల కిషోర్, బెస్త రాజు, బూస సింహం, పందుల స్వామి తదితరులు పాల్గొన్నారు.
అనుచిత పోస్టులపై ఫిర్యాదు
RELATED ARTICLES
