అనుచిత పోస్టులపై ఫిర్యాదు

(రాజంపేట, జూలై 4 ప్రాంతీయ వార్త)రాజంపేట గ్రామానికి చెందిన వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు, పరువుకు భంగం కలిగించే పోస్టులు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం పలువురు రాజకీయ నాయకులు రాజంపేట ఎస్‌ఐ మహేష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుబ్బని శ్రీకాంత్ మాట్లాడుతూ, సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ అసత్య ప్రచారం, వ్యక్తిగత దూషణలు చేయడం సమాజంలో అశాంతికి దారితీసే చర్యలని...