(ప్రాంతీయ వార్త ప్రతినిధి ఆగస్టు 25)
లింగంపేట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య గారు ఈ మధ్యనే ఏ ఎస్ ఐ గా పదోన్నతి పొందిన సందర్భంగా బిజెపి లింగంపేట మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో ఏ ఎస్ ఐ పెద్దయ్య గారిని సన్మానించడం జరిగింది.
ఇదివరకు వారు హెడ్ కానిస్టేబుల్ గా ఉన్నప్పుడు వారు లింగంపేట పోలీస్ స్టేషన్లో లింగంపేట్ మండల ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. వారు పదోన్నతి పొందిన తర్వాత కూడా ఏఎస్ఐ గా లింగంపేట పోలీస్ స్టేషన్లో ఉండడం చాలా సంతోషకరమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏఎస్ఐ పెంటయ్య గారు కూడా నాకు మళ్ళీ లింగంపేట పిఎస్ లోనే బాధ్యత రావడం చేత నాపై మరింత బాధ్యత ఉందని ఇకపై లింగంపేట మండల ప్రజలకు నేను వారికి న్యాయం పట్ల ఎల్లవేళలా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటి పదాన్ని కాపాడడానికి నేను మరింత కృషి చేస్తారని వారు కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి రాజారామ్ రమేష్, సీనియర్ నాయకులు మాజీ మండల బీజేవైఎం అధ్యక్షులు సూరాయిపల్లి అనిల్,దాసరి అనిల్ లింగంపేట పట్టణ అధ్యక్షులు నరేష్ భగవాన్, చందు, కృష్ణయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బిజెపి లింగంపేట మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఏఎస్ఐ గారికి సన్మానం
RELATED ARTICLES
