(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి జులై 10)
కామారెడ్డి జిల్లా గర్గుల్ ఉన్నంత పాఠశాలలో నిర్వహించిన మూడు రోజుల హిందీ భాష శిక్షణ కేంద్రంలో భోజన విరమణ సమయంలో హిందీ భాషా పండితులందరూ నిరసన తెలిపారు.పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని
హెల్త్ కార్డులు తొందరగా ఇవ్వాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ ప్రవేశపెట్టాలని, 2003 డిఎస్సి అభ్యర్థులకు వెంటనే పాత పెన్షన్ అమలు చేయాలని, 317 ఉపాధ్యాయులకు తమ సొంత జిల్లాకి వెళ్లేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం డిమాండ్ చేశారు
కామారెడ్డి మండలం గర్గుల్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మూడు రోజుల హిందీ భాషా శిక్షణ కేంద్రంలో భోజన విరామ సమయంలో హిందీ భాషా పండితులందరూ నిరసన తెలిపారు
ఈ సందర్భంగా టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం మాట్లాడుతూ హిందీ భాష టెట్ విషయంలో సంబంధం లేని సబ్జెక్టు సోషల్ వల్ల హిందీ భాషా పండితులు క్వాలిఫై కాలేకపోతున్నారని సంబంధంలేని సోషల్ ఉండము భాషా పండితులకు తీరని సమస్యగా మారిందని ప్రభుత్వం వెంటనే ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు
అలాగే పాఠశాలలను ఎత్తివేస్తున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఉపాధ్యాయులు విద్యారంగంలో ఆందోళన కలిగిస్తున్నదని ఇలాంటి ఆలోచనలను ప్రభుత్వం మానుకోవాలని తెలిపారు
పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం సదాశివనగర్ మండలం అధ్యక్షులు మహమ్మద్ లియాస్ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, గాంధారి మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్, రాష్ట్రీయ పండిత పరిషత్ కామారెడ్డి జిల్లా బాధ్యులు వంశీ ధర్ హిందీ ఫోరం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇంద్ర శేఖర్. సహింద్రనాథ్ మరియు ఏడు మండలాల హిందీభాషాపండితులు పాల్గొన్నారు
పి ఆర్ సి నీ వెంటనే ప్రకటించాలి టి పి టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం డిమాండ్.,
RELATED ARTICLES
