ప్రాంతీయ వార్త ప్రతినిధి ఆగస్టు 25
గాంధారి: గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేసి, ప్రతి కుటుంబం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని గ్రామస్తులకు సూచించారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పెంచడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాలని గ్రామ సర్పంచ్ బంగారు శంకర్ కోరారు. మొక్కల పెంపకం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సౌందర్య, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లో ఘనంగా వనమహోత్సవం
RELATED ARTICLES
