ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎంబీబీఎస్ గ్రహీతకు సన్మానం

ఎంబీబీఎస్ గ్రహీతకు సన్మానం

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 15)



కామారెడ్డి జిల్లా,గాంధారి మండలం, మేడిపల్లి గ్రామానికి చెందిన పొట్టకూరి సాయిలు మనవడు అనిల్ కుమార్ నీట్ ప్రవేశ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా మేడిపల్లి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనిల్ కుమార్ కఠోర శ్రమ, పట్టుదల, నిరంతర కృషికి మెచ్చిన సర్పంచ్ పిట్ల రోజా సుధాకర్, తనవంతు సహాయంగా తన మొదటి నెల జీతాన్ని అనిల్ కుమార్‌కు బహూకరించి ప్రత్యేక గుర్తింపునిచ్చారు.
సర్పంచ్ పిట్ల రోజా సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ తరఫున అనిల్ కుమార్‌ను ఘనంగా సత్కరించి, ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులు మాట్లాడుతూ, నీట్ వంటి అత్యంత పోటీతో కూడిన ప్రవేశ పరీక్షలో విజయం సాధించడం గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. ఈ విజయంలో అనిల్ తాత, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులతో పాటు మొత్తం ప్రాంతమే గర్విస్తోందని అభిప్రాయపడ్డారు.
అనిల్ కుమార్ ఉన్నత విద్యను విజయవంతంగా పూర్తి చేసి, ప్రతిభావంతమైన, నైతిక విలువలు కలిగిన వైద్యుడిగా ఎదిగి బాధిత మానవాళికి సేవ చేయడమే జీవిత లక్ష్యంగా చేసుకోవాలని సర్పంచ్, గ్రామ ప్రజలు ఆకాంక్షించారు. కష్టపడి పనిచేసే యువతను ప్రోత్సహించడం అందరి బాధ్యతని, ఒక యువకుడు సాధించే విజయం కేవలం అతని కుటుంబానికే కాక మొత్తం గ్రామానికి గర్వకారణమై భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్సు చంద, వార్డు సభ్యులతో పాటు హ్యుమానిటీ వెల్ఫేర్ ఫౌండేషన్ సెక్రటరీ ముహమ్మద్ ఆరిఫ్, రాజకీయ పార్టీ నేతలు, జనతా యూత్ యువకులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొని అనిల్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.



RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!