ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ముదేలి సర్పంచ్ లక్ష్మణ్

ఎమ్మెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ముదేలి సర్పంచ్ లక్ష్మణ్

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి సెప్టెంబర్ 15)

గాంధారి: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే  మదన్ మోహన్ రావు సమక్షంలో గాంధారి మండలం ముదేలి గ్రామ సర్పంచ్ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో మదన్ మోహన్ రావు సర్పంచ్ లక్ష్మణ్‌కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అనంతరం సర్పంచ్ లక్ష్మణ్ ఏఎంసీ చైర్మన్ బండారీ పరమేశ్వర్  మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామాల అభివృద్ధిపై ఆయన చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నాయకత్వంలో ముదేలి గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!