ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఎడిటోరియల్అక్రమ ఇసుక నిల్వలు తొలగించాలి

అక్రమ ఇసుక నిల్వలు తొలగించాలి

📰 Generate e-Paper Clip



నాగిరెడ్డిపేట, సెప్టెంబర్‌ 16 ( ప్రాంతీయ వార్త):

గోపాల్‌పేట గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను వెంటనే తొలగించాలని డీఎల్‌పీవో బి. సురేందర్‌ ఆదేశించారు. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇసుక నిల్వ చేస్తున్న స్థలాన్ని పరిశీలించి, ఆ స్థలాన్ని గ్రామపంచాయతీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామపంచాయతీకి సంబంధించిన పశువుల సంత స్థలంలో కొంతమంది అక్రమంగా ఇసుకను నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ఇసుక నిల్వలను వెంటనే తొలగించాలని డీఎల్‌పీవో సురేందర్‌ హెచ్చరించారు. పంచాయతీ స్థలాలను అనధికారికంగా వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రాజపల్లి వంశీకృష్ణ గౌడ్‌, ఉపసర్పంచ్‌ గులాం హుస్సేన్, గ్రామపంచాయతీ కార్యదర్శి సలీం,పాలకవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!