ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఎడిటోరియల్లింగంపేట్ మండల బీజేపీలో భారీ చేరికలు

లింగంపేట్ మండల బీజేపీలో భారీ చేరికలు

📰 Generate e-Paper Clip

(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 16)

లింగంపేట్: లింగంపేట్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో భారీగా యువకులు బీజేపీలో చేరారు. మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది యువకులు పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. యువత దేశానికి వెన్నెముక అని, యువకులు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పట్ల యువత ఆసక్తి చూపుతూ పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. లింగంపేట్ మండలంలో రానున్న రోజుల్లో మరింత మంది యువకులు బీజేపీలో చేరనున్నారని తెలిపారు. పార్టీలో చేరిన యువతకు అండగా ఉంటూ బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు.
అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్ మాట్లాడుతూ.. యువకులు స్వచ్ఛందంగా పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. లింగంపేట్ పట్టణంలో ఇప్పటికే సుమారు 100 మంది యువకులు బీజేపీలో చేరారని, రానున్న రోజుల్లో మరో 200 మంది వరకు పార్టీలో చేరే అవకాశం ఉందని తెలిపారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో డాక్టర్ పైడి ఎల్లారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల యువత ఆకర్షితులవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారంలో లేకపోయినా సొంత నిధులతో ప్రజా సమస్యల పరిష్కారానికి, సేవా కార్యక్రమాలకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు శివన్న గారి నవీన్ కుమార్, ఎల్లారెడ్డి నియోజకవర్గ బీజేవైఎం నాయకులు దాసరి అనిల్ కుమార్, మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నంద్యాల ఉదేశ్, మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి రాజారాం రమేష్, పట్టణ అధ్యక్షుడు నరేష్ భగవాన్, బీజేపీ వార్డు సభ్యులు పారిపల్లి సంతోష్ కుమార్, రాజారాం తల్వార్ సాయిలు, సంగమేశ్వర్, బెస్త లక్ష్మణ్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!