అక్రమ ఇసుక నిల్వలు తొలగించాలి
నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 16 ( ప్రాంతీయ వార్త): గోపాల్‌పేట గ్రామపంచాయతీ పరిధిలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను వెంటనే తొలగించాలని డీఎల్‌పీవో బి. సురేందర్ ఆదేశించారు. గ్రామపంచాయతీ తీర్మానం మేరకు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇసుక నిల్వ చేస్తున్న స్థలాన్ని పరిశీలించి, ఆ స్థలాన్ని గ్రామపంచాయతీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.గ్రామపంచాయతీకి సంబంధించిన పశువుల సంత స్థలంలో కొంతమంది అక్రమంగా ఇసుకను నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ఇసుక నిల్వలను వెంటనే తొలగించాలని డీఎల్‌పీవో సురేందర్ హెచ్చరించారు. పంచాయతీ...