ఎంబీబీఎస్ గ్రహీతకు సన్మానం

(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 15) కామారెడ్డి జిల్లా,గాంధారి మండలం, మేడిపల్లి గ్రామానికి చెందిన పొట్టకూరి సాయిలు మనవడు అనిల్ కుమార్ నీట్ ప్రవేశ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా మేడిపల్లి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనిల్ కుమార్ కఠోర శ్రమ, పట్టుదల, నిరంతర కృషికి మెచ్చిన సర్పంచ్ పిట్ల రోజా సుధాకర్, తనవంతు సహాయంగా తన మొదటి నెల జీతాన్ని అనిల్ కుమార్‌కు బహూకరించి ప్రత్యేక గుర్తింపునిచ్చారు.సర్పంచ్ పిట్ల...