ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిసోషల్ వర్కర్ల - భవిష్యత్ ఉద్యోగ ఆవశ్యకత అవగాహన సదస్సు

సోషల్ వర్కర్ల – భవిష్యత్ ఉద్యోగ ఆవశ్యకత అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి 19

సోషల్ వర్కర్ల – భవిష్యత్ ఉద్యోగ ఆవశ్యకత అనే అవగాహన సదస్సు. ముఖ్యఅతిథిగా హాజరైన స్వాన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్. పీ.బీ. సత్యం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లను నియమించడానికి…! సన్నహాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసినదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉన్నత పాఠశాలలను ఈ నియమాకాలు చేయడానికి. ముందుకు రావడం చాలా సంతోషకరమైన విషయం అయినప్పటికీ…! ఇక్కడే మీకు మేము మా యొక్క విజ్ఞప్తి తెలియజేస్తున్నాం…! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వివిధ సబ్జెక్టులలో పాఠ్యాంశాలు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుల లో ఒకరిని ఎంపిక చేసుకొని వారికి న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో చట్టాల పట్ల శిక్షణ ఇచ్చి వారిని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల గా 5711 మంది ఉపాధ్యాయులను నియమించడం ఎంతవరకు సమంజసము మాకు అర్థం కావడం లేదు…! వారు విద్యార్థులకు ఎప్పుడు పాఠ్యాంశాలు బోధిస్తారు…? చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల గా వారు బాధ్యత ఎప్పుడూ నిర్వర్తిస్తారు…? పని భారంతో తీవ్రమైన ఒత్తిడితో విద్యార్థులకు సరియైన న్యాయం జరగదని…! సోషల్ వర్కర్స్ అందరం భావిస్తున్నాం…! కాబట్టి సోషల్ వర్క్ పూర్తి చేసిన అభ్యర్థులను శాశ్విత ప్రతిపాదికను….! చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల గా నియమించాలని మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖను కోరుతున్నాము…! తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో పనిచేస్తుంది కాబట్టి, వారు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!*” *”అదేవిధంగా తెలంగాణ విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు..! ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల సోషల్ వర్కర్స్ పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!