ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిలారీల కొరతపై అధికారులతో చర్చించిన పీఏసీఎస్ అధ్యక్షుడు ఏగుల నర్సిములు

లారీల కొరతపై అధికారులతో చర్చించిన పీఏసీఎస్ అధ్యక్షుడు ఏగుల నర్సిములు

📰 Generate e-Paper Clip



ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19 ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘము అధ్యక్షులు ఏగుల నర్సిములు  మంగళవారం రోజున గండిమసానిపేట్, అడవిలింగాల, లక్ష్మాపూర్ ప్రాంతాలలోని పీసీసీ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు అందుతున్న సేవలు, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
సెంటర్లలో లారీల కొరత కారణంగా ధాన్యం తరలింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించిన ఆయన, సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లారీల సంఖ్యను పెంచాలని అధికారులను కోరినట్లు తెలిపారు.
రైతుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని పిఏ సిఎస్ అధ్యక్షుడు ఏగుల నర్సిములు  పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!