ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డివ్యవసాయ శాఖ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్

వ్యవసాయ శాఖ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19.

హైదరాబాద్ నాంపల్లిలోని వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్‌లో మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.

తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్‌కు చెందిన కబ్జాకు గురవుతున్న భూములను హైడ్రా అధికారులతో సమన్వయం చేసి పరిరక్షించడంలో కాసుల బాలరాజు చూపిన చొరవను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.

అలాగే, సంస్థకు చెందిన 23 ఎకరాల ప్రభుత్వ భూమిని వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌కు కేటాయించడం ద్వారా సంస్థకు సంవత్సరానికి సుమారు రూ. 5 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ మరియు వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ అధికారుల మధ్య ఎంఓయూ (MoU) కుదిరింది. ప్రభుత్వ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థ ఆదాయాన్ని పెంచే దిశగా ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. ఈ కార్యక్రమమంలో వెర్ హోసింగ్ ఛైర్మెన్ రాయల నాగేశ్వర్రావు , వ్యవసాయ ప్రిన్సిపాల్ సెక్రటరీ సురేందర్ మోహన్ ,అగ్రో ఎండి రాములు వెర్ హోసింగ్ ఎండి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!