ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిAIBSS నేతల ముందస్తు అరెస్ట్* *▪️నిరసనకు ముందే అదుపులోకి బంజారా నేతలు*

AIBSS నేతల ముందస్తు అరెస్ట్* *▪️నిరసనకు ముందే అదుపులోకి బంజారా నేతలు*

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 19.

సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం కోసం లంబాడీ సంఘాలు మళ్లీ గళమెత్తాయి. బంజారాహిల్స్‌లో గుడి నిర్మాణానికి 100 ఎకరాల భూమితో పాటు రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (AIBSS) తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు నరేష్ నాయక్, ఎల్లారెడ్డి డివిజన్ యూత్ జనరల్ సెక్రటరీ లడ్డు (లక్ష్మణ్ నాయక్)ను మంగళవారం ఉదయం నిరసనకు ముందే ఎల్లారెడ్డి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తెలంగాణలో లంబాడీలు మూడో అతిపెద్ద వర్గమని పేర్కొంటూ… తమ ఆత్మగౌరవానికి చిహ్నంగా సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం అవసరమని వారు స్పష్టం చేశారు. గుడి నిర్మాణం ద్వారా సమాజానికి గుర్తింపు పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ డిమాండ్‌పై స్పందన రాకపోవడంతో మే 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ఎదుట నిరసనకు సిద్ధమైన ఈ నేతలను ఎల్లారెడ్డి పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!