ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిరోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

📰 Generate e-Paper Clip

 

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 17

అతివేగం నిర్లక్ష్యం మద్యం మత్తులో వాహనాలు నడపడం పలువురు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి అతివేగంగా మద్యం తాగి వాహనాలు నడపకూడదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఇంకా మార్పు రావడం లేదు స్థానికంగా ఉన్న పోలీసులు దీనిపై సరైన శ్రద్ధ చూపకపోవడం వల్ల కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి వచ్చేవరకు పిల్లలు ఎదురుచూపులు చూస్తున్నారు ఇలాంటి సమయంలో ప్రమాదాల బారిన పడటం వారి కుటుంబాలు రోడ్డుమీదికి వస్తున్నాయి తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు బాన్సువాడ నుంచి బీర్కూరు పోయే రోడ్డుపై తవేరా ఫోర్ వెహికిల్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడం ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడు బీర్కూరు మండలం అన్నారం గ్రామం కి చెందిన చాకలి శేఖర్ గా గుర్తించారు మృతిని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పోలీస్ వాళ్ళు తరలించారు బాన్సువాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!