ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిదొడ్డు రకం వడ్లు మాకొద్దు లారీల ధాన్యం తీసుకోవడానికి రైస్ మిల్లర్ నిరాకరణ రోడ్లపై లారీలను...

దొడ్డు రకం వడ్లు మాకొద్దు లారీల ధాన్యం తీసుకోవడానికి రైస్ మిల్లర్ నిరాకరణ రోడ్లపై లారీలను పెట్టి రాకపోకలకు అంతరాయం 

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 17

రైతు పంట పండించడానికి నాలుగు నెలలు చలి గాలి వర్షం అనే లెక్కచేయకుండా ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అమ్ముకుందామంటే రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలుకు వేగవంతం చేయాలంటూ అన్నదాతలు రోడ్డెక్కి నిరసన ఎన్నో మండలాల లో ధర్నాలు చేపడుతున్నారు మరోపక్క మొక్కజొన్న జొన్న శనిగ కొనుగోలు చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుంది ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో గల యూనిసైడ్ రైస్ మిల్ ధాన్యం లారీలు వచ్చి వారం రోజులు అవుతున్న ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి రైస్ మిల్ యజమాని ముందుకు రాకపోవడం వల్ల వారం రోజుల నుంచి రైస్ మిల్ ముందు నిరీక్షించిన లారీలను లారీల డ్రైవర్లు రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ దాన్యం లారీలను రహదారిపై అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు ప్రభుత్వం ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన దొడ్డు ధాన్యం తీసుకోవాలని ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి గ్రామ శివారులోని యూనిఫైడ్ రైస్ మిల్కీ అనుమతులు ఇవ్వగా దొడ్డు ధాన్యం తీసుకోవడం సాధ్యం కాదంటూ రైస్మిల్ యజమాని మండిపట్టు పట్టారు ప్రభుత్వం ఈ రైస్ మిల్ ధాన్యం అలాట్మెంట్ చేసినప్పటికీ దొడ్డు ధాన్యం తాను తీసుకోనని రైస్ మిల్ యజమాని మొండి చేయడంతో దీనిని నిరసిస్తూ వారం రోజులుగా రైస్ మిల్ ముందు వరుస క్రమంలో ఉన్న ధాన్యం లారీలను ప్రధాన రహదారిపై అడ్డంగా పెట్టి నిరసనకు దిగడంతో రాత్రి వేళలో హైదరాబాద్ నుంచి బాన్స్వాడకు వచ్చే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి తమ దాన్యం తీసుకునే వరకు లారీలను రోడ్డుపై నుంచి కదిలించలేమని లారీ డ్రైవర్లు మండిపట్టు పట్టారు మరొకపక్క దొడ్డు ధాన్యం తాము చూసుకునేది లేదని రైస్ మిల్ యజమాని రైతులకు కరాకంటిగా వెల్లడిస్తున్నారు వెంటనే స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రైతులు కోరారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!