ePaper
Monday, June 29, 2026
ePaper
Homeఎడిటోరియల్రాహుల్ గాంధీ జన్మదినం

రాహుల్ గాంధీ జన్మదినం

📰 Generate e-Paper Clip

లింగంపేట్ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 19

భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం  నిపురస్కరించుకుని లింగంపేట మండలం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో  నేడు లింగంపేట కేజీబీవీ (KGBV) పాఠశాలలో మరియు జీవధాన్ వృద్ధ ఆశ్రమంలో విద్యార్థినులకు,వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి కట్టుబడి ఉండాలనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు దేశ యువత, విద్యార్థుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వారి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
విద్యార్థినులకు పండ్లు పంపిణీ చేసి వారి క్షేమాన్ని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకు దీర్ఘాయుష్షు మరియు మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించే శక్తి కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో లింగంపేట్ మండల యూవజన కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర రామకృష్ణ గౌడ్. అసెంబ్లీ సెక్రటరీ రాజేశ్వర్ గౌడ్.MYF అధ్యక్షులు నాగేష్. టౌన్ ప్రసిడెంట్ సుల్తాన్.లింగంపేట్ ఉప్ప సర్పంచ్ ప్రసాద్ గౌడ్. వార్డ్ మెంబెర్ గుండా బాలకిషన్. యూత్ కాంగ్రెస్ నాయకులు రియాజ్.ఫయాజ్.మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్కొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!