ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 06
భారత దేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బరంగ్ ఏడ్గి గ్రామ సర్పంచ్ రెంజర్ల అనీల్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని బరంగ్ ఏడ్గి గ్రామంలో భారత దేశ ఉప ప్రధానమంత్రి డా. బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బాబూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి, అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త అని అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5వ తేదీన జన్మించారని, 1986 జూలై 6వ తేదీన తుది శ్వాస విడిచారన్నారు. ఆయనను అందరూ ప్రేమగా ‘బాబూజీ’ అని పిలిచేవారన్నారు. ఆయన బీహార్లోని షాహాబాద్ (ప్రస్తుత భోజ్పూర్) జిల్లాలోని చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్ 5న సామాన్య రైతు కుటుంబమైన శోభిరామ్, వాసంతీ దేవి దంపతులకు జన్మించారు. పాఠశాల రోజుల్లోనే కులవివక్షతను ఎదుర్కొన్న ఆయన పండిట్ మదన్ మోహన్ మాళవ్య స్ఫూర్తితో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలో 1931లో బి.యస్సీ పూర్తి చేశారని, అయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న, ఏఎంసీ డైరెక్టర్ గోండ్ల రాజు, గ్రామ ఉప సర్పంచ్ ప్రవీణ్ దేశ్ ముఖ్, పంచాయతీ కార్యదర్శి గురునాథ్, కారోబారి జంగం పర్వయ్య, ఇందూరు రాములు, దమ్మని అంజయ్య, వార్డు సభ్యులు వడ్ల యాదవ రావు, నాయకులు గాజుల పండరి, మేత్రి నాగుగొండ, పుల్కంటి హన్ముగొండ, కోటగిరి గంగొండ, ఇందూరు గజేందర్, వడ్ల నాగయ్య, పసుపుల రాములు, గైని నర్సయ్య, అన్న అంజయ్య, క్యాదని లింగప్ప, జంగం రాచప్ప, లక్కపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
బాబూజీ ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి.బరంగ్ ఏడ్గి గ్రామ సర్పంచ్ రెంజర్ల అనీల్ కుమార్.
RELATED ARTICLES
