ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి రూ.5 లక్షల LOC... మల్లికార్జున్ చొరవతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తోట...

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి రూ.5 లక్షల LOC… మల్లికార్జున్ చొరవతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

మాజీ సర్పంచ్ శ్రీధర్ కుటుంబానికి రూ.5 లక్షల LOC అందజేత…

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 13

నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ *శ్రీధర్ గారి* కుమార్తె గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు* మానవతా దృక్పథంతో వెంటనే స్పందించారు.
ఈ విషయాన్ని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి* దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల LOC (Letter of Credit) మంజూరు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి* ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు* అచ్చంపేట మాజీ సర్పంచ్ *శ్రీధర్ గారికి* రూ.5 లక్షల LOC పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా *ఏలే మల్లికార్జున్ గారు* మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
LOC మంజూరు చేసిన ఎమ్మెల్యే *తోట లక్ష్మీకాంతరావు గారికి* శ్రీధర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో NRI భుజంగారి భాస్కర్ రెడ్డి గారు, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి గారు, అచ్చంపేట గ్రామ సర్పంచ్ సంకు లక్ష్మయ్య సార్ గారు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!