ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 13
నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ *శ్రీధర్ గారి* కుమార్తె గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు* మానవతా దృక్పథంతో వెంటనే స్పందించారు.
ఈ విషయాన్ని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి* దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల LOC (Letter of Credit) మంజూరు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే *శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి* ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు* అచ్చంపేట మాజీ సర్పంచ్ *శ్రీధర్ గారికి* రూ.5 లక్షల LOC పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా *ఏలే మల్లికార్జున్ గారు* మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
LOC మంజూరు చేసిన ఎమ్మెల్యే *తోట లక్ష్మీకాంతరావు గారికి* శ్రీధర్ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో NRI భుజంగారి భాస్కర్ రెడ్డి గారు, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి గారు, అచ్చంపేట గ్రామ సర్పంచ్ సంకు లక్ష్మయ్య సార్ గారు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.