ePaper
Sunday, September 13, 2026
ePaper
Homeఎడిటోరియల్జువ్వాడిలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏర్పాటు

జువ్వాడిలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

జువ్వాడిలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏర్పాటు

గాంధారి, సెప్టెంబర్ 12 (ప్రాంతీయ వార్త):

గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. గాంధారి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు సంఘం రాజు ఆధ్వర్యంలో, మాదిగ జాతి ప్రజల సహకారంతో గ్రామ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సంఘం రాజు మాట్లాడుతూ, మాదిగ జాతి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా అందరూ ఐక్యంగా నిలబడి సంపూర్ణ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని అన్నారు. ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేసి జాతి ప్రజలను సంఘటితం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జువ్వాడి గ్రామ ఎమ్మార్పీఎస్ కమిటీ అధ్యక్షుడిగా మల్లమ్మారి సంతోష్, అధికార ప్రతినిధిగా మేతరీ మహేష్లను ఉపసర్పంచ్ సంతోష్, జాతి ప్రజల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో గాంధారి పట్టణ అధ్యక్షుడు గడ్డమిడి ప్రవీణ్, మండల కార్యదర్శులు చిమ్మని సాయిలు, పోతరాజు రాజు, పార్వయ్య, మల్లమ్మారి సాయన్న, అన్వేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి, మాదిగ జాతి ప్రజల హక్కులు మరియు సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!