(ప్రాంతీయ వార్త ప్రతినిధి సెప్టెంబర్ 09 )
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఉత్తమ ప్రిన్సిపాల్ కు ఘన సన్మానం..!
రాష్ట్రస్థాయిలో ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉత్తమ ప్రిన్సిపాల్ గా ఇటీవల అవార్డు అందుకున్న తాడ్వాయి ప్రిన్సిపాల్ టి శ్రీనివాసరావును బుధవారం కళాశాల అధ్యాపకులు నాన్ టీచింగ్ ఉద్యోగులు ఘనంగా సన్మానం చేశారు. ఆయనకు శాలువా కప్పి పూలమాలతో సత్కరించి మెమొంటోను బహుకరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహిత ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ అంకితభావంతో పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ వ్యవస్థలో తాను అందించిన సేవలకు గుర్తింపు గాను ప్రభుత్వం ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిందని ఆయన తెలిపారు. సమిష్టి కృషివలనే తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కళాశాల
అధ్యాపకులు మాట్లాడుతూ మా కళాశాల ప్రిన్సిపాల్ విధి నిర్వహణలో రాజీకి తావు లేకుండా అంకితభావంతో కళాశాల అభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు తన సర్వీస్ లో ఇంటర్మీడి యట్ వ్యవస్థకు విశేష సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు అందించిందని పేర్కొన్నారు. ఉత్తమ ప్రిన్సిపల్ గా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు అధ్యాపక లోకానికి మార్గదర్శకులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాప కేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి లో తాడ్వాయి జూనియర్ కళాశాల ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు అందుకున్న టి శ్రీనివాస్ రావు సన్మానించిన. తాడ్వాయి జూనియర్ కళాశాల బృందం.
RELATED ARTICLES
