(ప్రాంతీయ వార్త ఆగస్టు 07)
గౌరారం: స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు గౌరారం గ్రామంలో ఎస్‌హెచ్‌జీ మహిళా సమైక్య భవన నిర్మాణానికి నేడు ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడే ఉద్దేశంతో నిర్మించనున్న ఈ మహిళా సమైక్య భవనం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎంతో ఉపయోగకరమైన వేదికగా నిలవనుందని నాయకులు తెలిపారు. మహిళల సంక్షేమం, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, ఆర్థిక స్వావలంబన, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ఈ భవనం అందుబాటులోకి రావడం ద్వారా గ్రామంలోని మహిళా సంఘాల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు, మహిళల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గాంధారి ఏఎంసీ చైర్మన్ బండారి పరమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ దాసరి శ్రీకాంత్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్లు కమ్మరి సంగమేష్, గుండె ప్రవీణ్ గౌడ్, స్థానిక సర్పంచ్ సువర్ణ అనిల్, ఉపసర్పంచ్ కృష్ణమూర్తి, వార్డు సభ్యులు, పంచాయతీరాజ్ డీఈ, ఏఈ సీసీ రమేష్, మహిళా అధ్యక్షురాలు, మహిళా సంఘ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మెల్డే లక్ష్మణ్, యూత్ అధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్ తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మహిళా సాధికారతకు అండగా నిలుస్తూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
గౌరారంలో ఎస్‌హెచ్‌జీ మహిళా సమైక్య భవనానికి ఘనంగా భూమిపూజ
RELATED ARTICLES
