గౌరారంలో ఎస్‌హెచ్‌జీ మహిళా సమైక్య భవనానికి ఘనంగా భూమిపూజ

(ప్రాంతీయ వార్త ఆగస్టు 07)గౌరారం: స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు గౌరారం గ్రామంలో ఎస్‌హెచ్‌జీ మహిళా సమైక్య భవన నిర్మాణానికి నేడు ఘనంగా భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడే ఉద్దేశంతో నిర్మించనున్న ఈ మహిళా సమైక్య భవనం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎంతో ఉపయోగకరమైన వేదికగా నిలవనుందని నాయకులు తెలిపారు. మహిళల సంక్షేమం, స్వయం ఉపాధి అవకాశాల కల్పన, ఆర్థిక స్వావలంబన, సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.ఈ భవనం అందుబాటులోకి రావడం...