ePaper
Thursday, July 2, 2026
ePaper
Homeఎడిటోరియల్ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.లింగంపేట్ మండలం పర్మల్ల గ్రామానికి...

ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.లింగంపేట్ మండలం పర్మల్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ గూటికి

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 01



ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై లింగంపేట్ మండలం పర్మల్ల గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఎల్లారెడ్డిలోని ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిరాం యాదవ్ గారి సమక్షంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిలో పర్మల్ల గ్రామ ఉపసర్పంచ్ కోడబోయిన శ్రీను, మాజీ మండల అధ్యక్షులు చంద్రబాబు, సొసైటీ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ కోడబోయిన శ్రీనివాస్, మాజీ బీఆర్ఎస్ అధ్యక్షులు గంట బాబు తదితర ప్రముఖ నాయకులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.
వీరితో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బద్ద రాజులు, ఇర్ల సాయిబాబు, కాశ ప్రశాంత్, ఇర్ల గోపాల్, రాజారెడ్డి, డీలర్ రాజు, చాకలి రవి, ఇర్ల సాయిలు, లేగ్గెల సాయిలు, పల్లె శేఖర్, రావుల శ్రీను, మంద రమేష్, గంట ఇస్తారీ, సాంబని గోపాల్, గంట శ్రీను, పద్మారావు, బెస్త భాగయ్య, ఇర్ల పరమేశ్, జగతి రవి, బెస్త నర్సింలు, మంద ప్రవీణ్, బద్ద కిష్టయ్య, ఇర్ల మోహన్, మన్నె రాము, గంప రవి, పోచాగౌడ్ తదితర గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!