ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeఎడిటోరియల్బాన్సువాడలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఘన స్వాగతం.. ప్రభుత్వ సలహాదారు పొచారం నివాసంలో డీసీసీ అధ్యక్షులు...

బాన్సువాడలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఘన స్వాగతం.. ప్రభుత్వ సలహాదారు పొచారం నివాసంలో డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మర్యాదపూర్వక ఆహ్వానం.

📰 Generate e-Paper Clip


ప్రాంతీయ వార్త ప్రతినిధి బాన్సువాడ, జూలై 1:

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ సలహాదారు *పొచారం శ్రీనివాస్ రెడ్డి గారి* నివాసానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి *పొన్నం ప్రభాకర్ గారికి* కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు* పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి *పొన్నం ప్రభాకర్ గారు* స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని SIR అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వివరించారు. ప్రజల్లో ఎలాంటి అపోహలకు తావులేకుండా, SIR ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల హక్కులను కాపాడుతూ ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో మంత్రి సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు *ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్,* ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ *కాసుల బాలరాజ్,* పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!