Praantiy Varta Pratinidhi June 27
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు ఆదేశాలతో అధ్యాపకులు విద్యార్థులకు యోగ శిక్షణ, ధ్యానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల పూర్వ విద్యార్థి, యోగా శిక్ష కుడు అజయ్ కుమార్ రెండు గంటల పాటు యోగా ఆసనాలు వేసి విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అలాగే యోగా వలన కలిగే ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి ప్రతి రోజు యోగా కోసం సమయం కేటాయించాలి అని సూచించారు. యోగా వలన ఆరోగ్యం తో పాటు మానసిక ధైర్యం పెరుగుతుందన్నారు. ఈ సందర్బంగా అధ్యాపకులు. వీరేశం, సతీష్ లు మాట్లాడుతు యోగా ప్రాధాన్యత గురించి తెలియచేశారు. ఇక్కడ చదివే విద్యార్థులకు విద్య తో పాటు అన్ని రంగాలలో తీర్చి దిద్దెందుకు అధ్యాపకులు సిద్ధంగా ఉన్నారని విద్యార్థులు అవకాశాలను సధ్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మల్లేశం, శ్రీకాంత్, అలంపల్లి శ్రీనివాస్, సరస్వతి, మనీషా, హారిక సిబ్బంది నరసయ్య, సోటేరియా పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
RELATED ARTICLES
