ePaper
Monday, June 29, 2026
ePaper
Homeఎడిటోరియల్మాదక ద్రవ్యాలపై దిశ నిర్దేశం

మాదక ద్రవ్యాలపై దిశ నిర్దేశం

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 26

విద్యార్థులకు మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల  కలిగే అనర్ధాల గురించి, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ హెచ్ ఓ డి డాక్టర్ శ్రీనివాస్ రావు గారు మరియు పీజీ కోఆర్డినేటర్ డాక్టర్ విశ్వప్రసాద్ గారు  ముఖ్య అతిథిగా విచ్చేసి  విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈరోజు కామారెడ్డి మున్సిపల్ కేంద్రంలో  అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగ వ్యతిరేక దినాన్ని సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సోషల్ వర్క్ విద్యార్థులు సోషల్ వర్క్ అధ్యాపకులు పాల్గొని, మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల, యువత తమ జీవితాన్ని, నాశనం చేసుకుంటున్నారని, వాటికి దూరంగా ఉంటూ, బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ HOD డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సోషల్ వర్క్ విద్యార్థులు సమాజంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్మించడానికి ఎల్లప్పుడు ముందుంటారని, సోషల్ వర్క్ కోర్సు చదివే విద్యార్థులకు ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్క్ అధ్యాపకులు  డాక్టర్ జి రమేష్, డాక్టర్.పి.బి. సత్యం, సోషల్ వర్క్ విద్యార్థులు పవనిత తిరుమల్ స్పందన అనిల్ శ్రీకాంత్ వంశీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!