ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలి

బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలి

📰 Generate e-Paper Clip



ఎల్లారెడ్డి,( ప్రాంతీయ వార్త ప్రతినిధి ):

ఓటరు జాబితా సవరణలో జరిగే ప్రక్రియలో పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి, డిసిసి అధ్యక్షులు ఆలే మల్లికార్జున అన్నారు. స్థానిక  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో,  మంగళవారం నియోజకవర్గస్థాయి ఓటర్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంపై క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, సీనియర్‌ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, జూన్‌ 15 నుంచి జులై 15 వరకూ బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ఓటర్లు పేర్లు చేర్పులు, మార్పులు, సవరణలకు సంబంధించిన పత్రాలను సక్రమంగా సమర్పించి రశీదులు పొందాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని పేర్కొన్నారు.

సర్‌పై అవగాహన ఉండాలి :  జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆలే మల్లికార్జున్

ఎల్లారెడ్డి పట్టణం డివిజన్ లోని (సర్‌)పై కార్యకర్తలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలని  డిసిసి అధ్యక్షులు ఆలే మల్లికార్జున్ అన్నారు.  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, సర్‌పై బూత్‌ ఇన్‌చార్జిలు, కార్యకర్తలకు, నాయకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!