కామారెడ్డి , మే 16 ప్రాంతీయ వార్త : వేసవిలో పండ్లు కాయలు ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు కొనుక్కోవాలంటేనే భయపడే విధంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మామిడి పండ్లు కొబ్బరి బోండాలు తాటికాయలు ఈత కాయలు నిమ్మకాయల ధరలకు రెక్కలు వచ్చి ఆకాశమే హద్దుగా విహరిస్తున్నాయి రిటైల్ మార్కెట్లో మామిడి పండ్ల ధరలు బంగినపల్లి రకం కేజీ 150 నుంచి 250 రూపాయల వరకు ధరలు విక్రయిస్తున్నారు.
తోతాపురి రకం 150 నుంచి 200 రూపాయల వరకు ధర పలుకుతుంది నూజివీడు ఉప్పలపాడు అవినీగడ్డ నాగాయలంక కోడూరు పులిగడ్డ పండ్ల రకాలు ప్రజలు అమితంగా తింటారు ఈసారి 40 శాతం వరకు పంట దిగుబడి తగ్గడమే అధిక ధరల కారణాలు అని రైతులు చెబుతున్నారు కొబ్బరి బోండాల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి నిన్నటి వరకు 40 రూపాయలు నుంచి 50 రూపాయలు అమ్మిన లీటర్ కొబ్బరి నీరు ప్రస్తుతం 100 రూపాయలు 120 రూపాయలు వరకు అమ్ముతున్నారు తాటికాయలు ఈత కాయలు ధరలు కూడా ఆకాశాన్ని అందుతున్నాయి తాటి ముంజలు సైదునిబట్టి గదిను 50 నుంచి 70 రూపాయల వరకు ఇక్కడ ఇస్తున్నారు ఈత కాయలు ధరలు 1/2 కేజీ 70 నుంచి 90 రూపాయలు వరకు అమ్ముతున్నారు నిమ్మకాయ ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు ఫిబ్రవరి నెల వరకు వర్షాలు పడటం పూత మొత్తం రాలిపోవడం నిమ్మకాయల ధరలు జరగడానికి కారణాలుగా చెబుతున్నారు ప్రస్తుతం హోల్సేల్ ధరల్లో 50 కేజీలు బస్సు 7000 నుంచి 9000 వరకు రిటైల్ కేజీ ధర 70 రూపాయల నుంచి 150 రూపాయలు వరకు సైజును బట్టి విక్రయిస్తున్నారు ఎండ తీవ్రత పెరిగినందువలన మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు.