విపరీతంగా పెరిగిన మామిడి పండ్లు నిమ్మకాయలు కొబ్బరి బోండాలు ధరలు
తగ్గిన దిగుబడి ధరలపై ప్రభావం కామారెడ్డి , మే 16 ప్రాంతీయ వార్త : వేసవిలో పండ్లు కాయలు ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు కొనుక్కోవాలంటేనే భయపడే విధంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మామిడి పండ్లు కొబ్బరి బోండాలు తాటికాయలు ఈత కాయలు నిమ్మకాయల ధరలకు రెక్కలు వచ్చి ఆకాశమే హద్దుగా విహరిస్తున్నాయి రిటైల్ మార్కెట్లో మామిడి పండ్ల ధరలు బంగినపల్లి రకం కేజీ 150 నుంచి 250 రూపాయల వరకు ధరలు విక్రయిస్తున్నారు. తోతాపురి రకం 150 నుంచి 200 రూపాయల వరకు...