ePaper
Monday, June 29, 2026
ePaper
Homeఎడిటోరియల్లింగంపేట్ పట్టణంలో రూ.30 లక్షల గోదాం నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్...

లింగంపేట్ పట్టణంలో రూ.30 లక్షల గోదాం నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు:*

📰 Generate e-Paper Clip

ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 23

లింగంపేట్ పట్టణంలో రూ.30 లక్షల గోదాం నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రైతులు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షాల కారణంగా తడిసి నష్టపోతున్న సమస్యను ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారి దృష్టికి తీసుకువచ్చారు. రైతుల ఇబ్బందులను అర్థం చేసుకున్న ఎమ్మెల్యే గారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించి లింగంపేట్ పట్టణంలో రూ.30 లక్షల వ్యయంతో గోదాం నిర్మాణానికి ఆమోదం పొందారు.
ఈ నేపథ్యంలో గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు భూమిపూజ నిర్వహించారు. ఈ గోదాం అందుబాటులోకి రావడంతో రైతులు తమ పంటను సురక్షితంగా నిల్వ చేసుకునే అవకాశం కలుగనుంది. ముఖ్యంగా అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ధాన్యం తడిసి నష్టపోకుండా భద్రపరుచుకోవడానికి ఈ గోదాం రైతులకు ఎంతో ఉపయోగపడనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ గారు మాట్లాడుతూ.
నేను ఎప్పుడూ రైతు పక్షానే నిలబడ్డాను. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండోసారి మొక్కజొన్న కొనుగోలు జరిగేలా కృషి చేశాను. జొన్నల కొనుగోలు కేంద్రాల కోసం పోరాడాను. ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించాను. ఎల్లారెడ్డి రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి పైలట్ ప్రాజెక్టును తీసుకువచ్చి రీ-సర్వే జరిగేలా కృషి చేశాను. అసెంబ్లీలో కూడా అనేకసార్లు ఎల్లారెడ్డి రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాను.
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది” అనే నమ్మకంతోనే నేను పనిచేస్తున్నాను. రైతుల కష్టానికి విలువ తీసుకురావడం, వారు పండించిన పంటను సురక్షితంగా భద్రపరుచుకునే వసతులు కల్పించడం నా బాధ్యత. లింగంపేట్ గోదాం నిర్మాణం పూర్తయిన తర్వాత రైతులు తమ ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుంది. రైతుల అభ్యున్నతి కోసం నేను నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను. అని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా వారి ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి కృషికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గోదాం నిర్మాణం లింగంపేట్ ప్రాంత రైతులకు ఎంతో మేలు చేయనుండగా, రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలవనుంది

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!