ప్రాంతీయ వార్త ప్రతినిధి.మే 18
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్ అధ్యక్షతన ఈనెల 26న హైదరాబాద్ ఇందిరా పార్కులు జరిగే మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి కరపత్రాన్ని విడుదల చేసిన రాష్ట్ర అధ్యక్షులు మూడవాత్ రాంబల్ నాయక్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథో డ్ గార్లు,
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ లో గిరిజనులకు 12 హామీలు ఇవ్వడం జరిగిందని అట్టి హామీలను తక్షణమే అమలు చేయాలని ఈనెల 26న ఇందిరాపార్క్ హైదరాబాదులో ఉదయం : 10 గంటలకు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్ల లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూడవాత్ రాంబల్ నాయక్ తెలియజేసినరు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో లంబాడీలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిన నేటి వరకు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని తక్షణమే లంబాడి గిరిజనులకు ఇచ్చిన 12 హామీల తో పాటు లంబాడీలకు గిరిజన మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తండాలను రెవెన్యూ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, లంబాడీల సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి ₹1000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, ఇచ్చిన హామీలను అమలు చేయని యెడల రాబోవు కాలంలో కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ఈనెల 26న హైదరాబాద్ కేంద్రంలో నిర్వహించి మహా ధర్నాకు లంబాడీలు పార్టీలకతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని
వారు కోరారు.
ఈ కార్యక్రమంలో LHPS రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ జాదవ్ , రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్ జాదవ్ , కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నునావత్ గణేష్ నాయక్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ , జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్ , జిల్లా గౌరవ అధ్యక్షులు రూప్సింగ్ రాథోడ్ , జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సభావాట్ శంకర్ నాయక్ , లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్ (ఎల్ ఎస్ ఓ) ప్రకాష్ మాలోత్, ఎస్ ఎస్ నగర్ మండల అధ్యక్షులు పీర్ సింగ్ నాయక్ , కామారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జబ్బర్ నాయక్ , రూరల్ అధ్యక్షులు విస్లావత్ గోపి, కామారెడ్డి టౌన్ అధ్యక్షులు మోహన్ నాయక్, జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్ జాదవ్ , బాన్సువాడ డివిజన్ ఇన్చార్జి రమేష్ రాథోడ్ , మాచారెడ్డి మండల అధ్యక్షులు బన్సీ నాయక్ , మాచారెడ్డి ఎస్టీ సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్, యూత్ ఉపాధ్యక్షులు రవీందర్ నాయక్, జీవీఎస్ జిల్లా అధ్యక్షులు వినోద్ నాయక్, జిల్లా నాయకులు హాజీ నాయక్ , రాజు నాయక్ , ఎల్లారెడ్డి డివిజన్ అధ్యక్షులు అంబర్ సింగ్ , తిరుపతి నాయక్ , తదితరులు పాల్గొన్నారు.
