ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఎడిటోరియల్రైతును రాజు చేసిన ఘనత కేసిఆర్ గారిదైతే రైతులను అరిగోశపెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి*   *దావ...

రైతును రాజు చేసిన ఘనత కేసిఆర్ గారిదైతే రైతులను అరిగోశపెట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి*
   *దావ వసంత సురేష్*

📰 Generate e-Paper Clip


ప్రాంతీయ వార్త ప్రతినిధి మే 23

రాయికల్ మండలం ఆలూరు గ్రామంలో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను బిఆర్ఎస్ నాయకులు మరియు రైతులతో కలిసి పరిశీలించిన జిల్లా తొలి జడ్పీ  చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
* అధికారుల నిర్లక్ష్యం వల్లనే కల్ల ల్లో ఎక్కడి ధాన్యం అక్కడె పేరుకుపోయిందని అన్నారు.
* గ్రామంలోని రైతులు కొనుగోలు చేయాలని ధర్నా చేసిన కూడా ఇక్కడున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారని దీన్నిబట్టి ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు.
* రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన వ్యవసాయం  బాగుపడ్డట్టు లేదు అనే సమేత లాగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు.
* ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం ఇంకో ఎత్తు అవుతుందని అన్నారు.
* తెలంగాణ రాష్ట్రానికి  వెన్నెముకైనటువంటి రైతును రాజు చేసిన ఘనత కెసిఆర్ గారిది అని, తెలంగాణ ఒక దేశానికి  అన్నపూర్ణగా ఉన్నది అని అంటే అది కేసీఆర్ గారి వల్లే అని అన్నారు.
* నెత్తి మీద ఎండ మరోవైపు కళ్లలో వడ్లు ఉన్నాయని రైతు పరిస్థితి అన్నమో రామచంద్ర లాగా ఉందని వర్షాలు తొందరగా వచ్చే అవకాశం ఉన్నందున రైతులు భయం గుప్పెట్లో పెట్టుకుని ఉంటున్నారని అన్నారు.
* రైతును రాజు చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని, పంట చేతికొచ్చి అమ్ముకునే సమయమైన కూడా రైతుబంధు ఇంకా పూర్తిగా వేయలేదని రైతుబంధు సంగతేమో గాని చేతికొచ్చిన పంట కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారని అన్నారు
* మేము వడ్లు కొంటున్నాం ప్రణాళికతో ఉన్నామని పేపర్ ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో పని జరగడం లేదని అన్నారు.
* బిఆర్ఎస్ హయాంలో ఒక ప్రణాళిక బద్ధంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేసిన నాయకుడు కేసీఆర్ గారు అయితే రైతులను అరిగోస పెడుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని అన్నారు.
* ప్రజా పాలన ప్రగతి పాలన అని దేనికి జరుపుకుంటున్నారు. కళ్ళలలో ఉన్న వడ్లు కొనుగోలు చేయనందుకు ప్రజా పాలన సంబరాలు జరుపుకుంటున్నార…?
* సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా దాన్యం కొనుగోలు చేపట్టాలని అన్నారు.
* ప్రజా పాలన పేరిట దరఖాస్తులతో ప్రజలను మభ్యపెడుతూ ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు.
* ఇప్పటికైనా ప్రభుత్వం మోద్దు నిద్ర మేల్కొని ఎక్కడ వడ్లు ఉన్నాయో త్వరగా కొనుగోలు పూర్తి చేయాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో BRS నాయకులు బర్కాం మల్లేష్ ఆనంద్ రావు సుధాకర్ పాక్స్ చైర్మన్ రాజి రెడ్డి సర్పంచ్ లు స్వామి రెడ్డి గంగాధర్ నాయకులు MD చాంద్ మల్లారెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆడెపు క్రిష్ణ నందు నాయక్  రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!