(రాజంపేట జులై 29 ప్రాంతీయ వార్త)
రాజంపేట మండలంలోని అన్ని రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తహసీల్దార్ జానకి సూచించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ-కేవైసీ అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలోని అన్ని రేషన్ డీలర్లు తమ దుకాణాలను నిర్ణీత సమయాల్లో తెరిచి ఉంచి ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడికి ఈ-కేవైసీపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. గడువు ముగిసేలోపు ప్రతి అర్హుడైన కార్డుదారుడు ఈ-కేవైసీ పూర్తి చేసుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా తమ సమీప రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి రేషన్ కార్డుదారుడు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని తహసీల్దార్ జానకి విజ్ఞప్తి చేశారు.
