రేషన్ ఈ-కేవైసీ పూర్తి చేసుకోండి: తహసీల్దార్ జానకి
(రాజంపేట జులై 29 ప్రాంతీయ వార్త) రాజంపేట మండలంలోని అన్ని రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తహసీల్దార్ జానకి సూచించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ-కేవైసీ అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మండలంలోని అన్ని రేషన్ డీలర్లు తమ దుకాణాలను నిర్ణీత సమయాల్లో తెరిచి ఉంచి ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారుడికి ఈ-కేవైసీపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. గడువు ముగిసేలోపు ప్రతి అర్హుడైన కార్డుదారుడు ఈ-కేవైసీ...