ప్రాంతీయ వార్త ప్రతినిధి జూన్ 12
నిజాంసాగర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోరే బాయ్ గారి కుమారుడి వివాహ వేడుక హైదరాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు *ఏలే మల్లికార్జున్ గారు* హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసిన మల్లికార్జున్ గారు,* వారి దాంపత్య జీవితం ఆనందమయం, ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి, వివాహ వేడుకలో పాల్గొన్న బంధుమిత్రులను పలకరించారు.
ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని నూతన దంపతులకు తమ ఆశీస్సులు అందజేశారు.
సమాజంలో కుటుంబ బంధాలు, సంప్రదాయ విలువలు చిరస్థాయిగా నిలవాలని, నూతన దంపతులు ఆదర్శవంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను” అని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు. పేర్కొన్నారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు.*
RELATED ARTICLES
