(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి ఆగస్టు. 10)
గుజ్జుల్ తండా గ్రామపంచాయతీలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది.
బంజారా సంప్రదాయంలో తీజ్ పండుగకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది.తాత ముత్తాతల కాలం నుంచి ప్రతి సంవత్సరం ఈ పండుగను తండాలో ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బంజారా లు ఆనవాయితీగా కొలుచుకునే పండగ ఆదివారం జరుపుకోవడం మాకెంతో సంతోషాన్నిస్తుందని స్థానిక పాలకవర్గం పేర్కొంది.
ఈ సందర్భంగా తీజ్ పండుగ కార్యక్రమంలో తండా నాయక్ సంజు నాయక్, కార్బారి భావ్‌సింగ్, గ్రామ సర్పంచ్ ఖట్రోత్ రవీందర్ గారితో పాటు తండా పెద్దమనుషులు, మహిళలు, యువతీ యువకులు పాల్గొని పండుగను విజయవంతం చేశారు.
