PRANTIYA VAARTHA
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 6:41 pm Posted by : RAVINDHAR

గుజ్జుల్ తాండాలో తీజ్ పండగ

(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి ఆగస్టు. 10)

గుజ్జుల్ తండా గ్రామపంచాయతీలో తీజ్ పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది.
బంజారా సంప్రదాయంలో తీజ్ పండుగకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది.తాత ముత్తాతల కాలం నుంచి ప్రతి సంవత్సరం ఈ పండుగను తండాలో ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బంజారా లు ఆనవాయితీగా కొలుచుకునే పండగ ఆదివారం జరుపుకోవడం మాకెంతో సంతోషాన్నిస్తుందని స్థానిక పాలకవర్గం పేర్కొంది.
ఈ సందర్భంగా తీజ్ పండుగ కార్యక్రమంలో తండా నాయక్ సంజు నాయక్, కార్బారి భావ్‌సింగ్, గ్రామ సర్పంచ్ ఖట్రోత్ రవీందర్ గారితో పాటు తండా పెద్దమనుషులు, మహిళలు, యువతీ యువకులు పాల్గొని పండుగను విజయవంతం చేశారు.