ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeతెలంగాణకామారెడ్డిఒకప్పుడు పూరిగుడిచే ఇప్పుడు అద్దాలమేడ కర్త కర్మ క్రియ ఎమ్మెల్యే మదన్మోహన్ ని అంటున్న ఇందిరమ్మ...

ఒకప్పుడు పూరిగుడిచే ఇప్పుడు అద్దాలమేడ కర్త కర్మ క్రియ ఎమ్మెల్యే మదన్మోహన్ ని అంటున్న ఇందిరమ్మ ఇల్లు యజమాని

📰 Generate e-Paper Clip

కామారెడ్డి ప్రతినిధి మే 27 ప్రాంతీయ వార్త.

రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన షైక్ సబీనా గారు ఎన్నో సంవత్సరాలుగా పూరి గుడిసెలో కుటుంబంతో కలిసి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. వర్షం పడితే ఇంట్లోకి నీరు రావడం, వేసవిలో ఎండ తీవ్రంగా ఉండటం వంటి సమస్యల మధ్య వారి కుటుంబం రోజులు గడిపేవారు.

సబీనా కుటుంబ పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించిన గ్రామస్తులు ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి విన్నవించగా, ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు చలించి వెంటనే ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా వారికి శాశ్వత నివాసాన్ని మంజూరు చేయించారు. ప్రస్తుతం కొత్త ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి కాగా, కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, “పూరి గుడిసెలో జీవితం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మా సొంత ఇంట్లో ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాం” అని కృతజ్ఞతలు తెలిపారు.

స్థానిక ప్రజలు కూడా ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి సేవలను అభినందిస్తూ, పేదల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకువస్తున్న నాయకుడిగా కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల మరియు గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!