(ప్రాంతీయ వార్త ప్రతినిధి జులై 27)
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల భూంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఐ.ఎస్.ఆర్.డి ( ఇన్స్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ కామారెడ్డి )స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఐ.ఎస్.ఆర్.డి అధ్యక్షురాలు రవళి . సీఈఓ రాజేందర్ (లింగంపల్లి గ్రామస్తులు)భూంపల్లి ఉన్నత పాఠశాలలోని 15 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు పెన్సిల్ ఎరేజర్ కిట్స్ భూంపల్లి గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు రవళి మాట్లాడుతూ ఐ.ఎస్.ఆర్.డి స్వచ్ఛంద సంస్థ నిరుపేద విద్యార్థుల కొరకు పనిచేస్తుందని వారికి ఏ అవసరం ఉన్నా సంస్థ ఆదుకుంటుందని భవిష్యత్తులో నిరుపేద విద్యార్థులకు ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నా సంస్థకు తెలియపరచగలరని వారు తెలియచేసారు . భూంపల్లి పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినందుకు ఐ.ఎస్.ఆర్.డి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మరియు సీఈవో కు గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గైని శ్రీనివాస్ ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ముత్తెన్న, హైమావతి, మాలతి, చింతల లింగం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
ఐ.ఎస్.ఆర్.డి స్వచ్ఛంద సంస్థ,ఆధ్వర్యంలో భూంపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ ల పంపిణీ
RELATED ARTICLES
