ePaper
Sunday, November 15, 2026
ePaper
Homeఎడిటోరియల్పదోసారి రక్తదానం చేసిన లెగ్గేల రాజు.సేవాభావానికి పోలీసు అధికారుల ప్రశంసలు.

పదోసారి రక్తదానం చేసిన లెగ్గేల రాజు.సేవాభావానికి పోలీసు అధికారుల ప్రశంసలు.

📰 Generate e-Paper Clip

పదోసారి రక్తదానం చేసిన లెగ్గేల రాజు

సేవాభావానికి పోలీసు అధికారుల ప్రశంసలు

లింగంపేట్, అక్టోబర్ 25 (ప్రాంతీయ వార్త):

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పదోసారి రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్న సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ–2005 తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి లెగ్గేల రాజును జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొన్న లెగ్గేల రాజు పదోసారి రక్తదానం చేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తన కార్యాలయంలో లెగ్గేల రాజును ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ సంజీవరెడ్డి సైతం ఆయన సేవలను ప్రశంసించారు. ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్ రెడ్డి, లింగంపేట్ ఎస్సై దీపక్ కుమార్ ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు.

రక్తదానం.. ప్రాణదానంతో సమానం

ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువతతో పాటు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. పదిసార్లు రక్తదానం చేయడం అభినందనీయమని, సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగుతున్న లెగ్గేల రాజు సేవలు ఇతరులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
సామాజిక సేవలో భాగంగా రక్తదానం చేసిన లెగ్గేల రాజుకు పలువురు అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!