ePaper
Tuesday, September 29, 2026
ePaper
Homeఎడిటోరియల్హైదరాబాద్‌లో లేబర్ కమిషనర్‌కు వినతి. భారీ సంఖ్యలో తరలిరావాలని కార్మికులకు పిలుపు.

హైదరాబాద్‌లో లేబర్ కమిషనర్‌కు వినతి. భారీ సంఖ్యలో తరలిరావాలని కార్మికులకు పిలుపు.

📰 Generate e-Paper Clip

వార్త ప్రతినిధి సెప్టెంబర్ 27

కామారెడ్డి, ఎల్లారెడ్డి. మున్సిపల్ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కార్మిక అంజయ్య భవన్‌లో లేబర్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ( బి ఎన్ ఆర్ కే ఎస్ ) కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మహామేస్త్రి మర్లు సాయిబాబు తెలిపారు. BNRKS రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రం అన్నగారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 55 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి నెలకు రూ.5,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రాష్ట్రంలోని ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈఎస్‌ఐ ఆసుపత్రి సౌకర్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుడు జీవించి ఉన్నంతకాలం లేబర్ కార్డు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, నకిలీ లేబర్ కార్డులను తొలగించి నిజమైన కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరారు.అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు నిజమైన కార్మికుడినే చైర్మన్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా, డివిజన్, మండల, పట్టణ, గ్రామ స్థాయిల్లో పనిచేస్తున్న నిజమైన భవన నిర్మాణ కార్మికులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి వినతిపత్రం అందజేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మహామేస్త్రి మర్లు సాయిబాబు పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో లేబర్ కమిషనర్‌కు వినతి.. భారీ సంఖ్యలో తరలిరావాలని కార్మికులకు పిలుపు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!