(ప్రాంతీయ వార్త ప్రతినిధి రవి సెప్టెంబర్ 24)
కామారెడ్డి:- తాడ్వాయి మండలం కాళోజీవాడి గ్రామానికి చెందిన గడ్డం హేమచంద్రిక అనే విద్యార్థిని తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ఆమెకు ప్రభుత్వం నుంచి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు బుధవారం కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ గిరి గారిని వారి కార్యాలయంలో కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
దోమకొండ సోషల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ 9వ తరగతి చదువుతున్న హేమచంద్రిక, ఈ నెల 19న హాస్టల్లో రాత్రి వేళ ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి విషమించడంతో వెంటనే ఆమెను నిజామాబాద్‌లోని వెల్నెస్ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు అత్యవసరంగా బ్రెయిన్ సర్జరీ (మెదడు ఆపరేషన్) నిర్వహించారు.దళిత సామాజిక వర్గానికి చెందిన హేమచంద్రిక తండ్రి చిన్నతనంలోనే మరణించారని, కుటుంబ పోషణే భారంగా మారిన దయనీయ స్థితిలో ఆ కుటుంబం జీవనం సాగిస్తోందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్జరీకి లక్షల్లో ఖర్చవుతుండటంతో ఆ పేద కుటుంబం ఆర్థికంగా భరించలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి, ప్రభుత్వపరంగా విద్యార్థినికి పూర్తి వైద్య సహాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తోల గంగారాం, అంబేద్కర్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు ధ్యామని భూపతి, మాజీ కౌన్సలర్ మోహన్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రమేష్, కార్యదర్శి రాజ నర్సు, RTI రాష్ట్ర కార్యదర్శి లేగ్గేల రాజు, తాడ్వాయి మండల అధ్యక్షులు గణేష్, జిల్లా నాయకులు గడ్డం రవీందర్, రవి తదితరులు పాల్గొన్నారు….
అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం దళిత విద్యార్థిని హేమచంద్రిక వైద్యానికి ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి…
RELATED ARTICLES
