ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 22 (ప్రాంతీయ వార్త ప్రతినిధి):
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో నూతనంగా డీఈఈగా పదవీ బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణను పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో విద్యుత్‌శాఖకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నాయకులు కోరారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పొలాల్లో రైతులకు అవసరమైన విద్యుత్ సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు విద్యుత్‌శాఖ సేవలు సకాలంలో అందేలా ఏడీ, ఏఈ, లైన్మెన్, జేఎల్ఎం అధికారులు అందుబాటులో ఉండాలని, విద్యుత్ సమస్యలపై ప్రజలు సంప్రదించినప్పుడు తగిన విధంగా స్పందించాలని కోరారు. శాఖలో పారదర్శకత, జవాబుదారీతనంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి విభాగం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు లింగమయ్య, సమాచార సంరక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాయకోటి గోపాల్, బహుజన సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి అసెంబ్లీ అధ్యక్షుడు మర్లు సాయిబాబు, పట్టణ నాయకుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి అధికారులు అందుబాటులో ఉండాలి – ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.
RELATED ARTICLES
